ఇండియా చేరుకున్న టీమిండియా క్రికెటర్లు
ఇండియా చేరుకున్న టీమిండియా క్రికెటర్లు
ముంబై/న్యూఢిల్లీ: అద్భుతమైన పోరాటంతో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై చిత్తుచేసి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకున్న టీమిండియా క్రికెటర్లకు స్వదేశంలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. ముఖ్యంగా టీమ్ స్టాండిన్ కెప్టెన్ అజింక్యా రహానెకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి చేరుకునే వరకు రహానెకు జనం జేజేలు పలికారు. రహానెతోపాటు కోచ్ రవిశాస్త్రి, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పేసర్ శార్దూల్ ఠాకూర్, ఓపెనర్ పృథ్వీ షా గురువారం ఎర్లీ మార్నింగ్
నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా వెళ్లి అన్ని ఫార్మాట్లలో ఇండియా తరఫున అరంగేట్రం చేసిన పేసర్ టి.నటరాజన్ బెంగళూరులో ల్యాండ్ అయ్యాడు. అక్కడి నుంచి తమిళనాడులోని తన స్వగ్రామం చిన్నప్పంపతి చేరుకున్నాడు. నటరాజన్‌కు ఇంటి వరకు రథంలో ఊరేగించిన వేలాది మంది గ్రామ ప్రజలు పేసర్‌పై పూల వర్షం కురిపించారు. దండలతో ముంచెత్తారు. గబ్బా టెస్ట్ హీరో పంత్ కూడా తన స్వస్థలం ఢిల్లీ చేరుకున్నాడు. అయితే, చెన్నైకి చెందిన రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. వీళ్లు శుక్రవారం స్వస్థలాలకు చేరుకునే చాన్స్ ఉంది.