మద్యం మత్తులో వేధింపులు : మనవడిని హత్య

మీర్ పేట పోలీస్ స్టేషన్ లెనిన్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది.  లెనిన్ నగర్ కు చెందిన కృష్ణ (32) తరచూ మద్యం తాగి ఇంట్లో గొడవ చేసేవాడు. గత కొంత కాలంగా బాధితుడి వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యం మత్తులో అక్క పిల్లల్ని మానసికంగా శారీరకంగా వేధించేవాడు. అయితే రాత్రి మద్యం మత్తులో ఉన్న కృష్ణ తన తల్లిని వేధించాడు. దీంతో క్షణికావేశంలో బాధితుడి అమ్మమ్మ  కిరోసిన్ పోసి నిప్పంటించింది. అప్రమత్తమైన స్థానికులు కృష్ణ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు కృష్ణ ఈరోజు మృతి చెందాడు.

Latest Updates