60 ఏళ్ల బామ్మ.. అవార్డును గెలుచుకుంది

Grandmother takes Nasa award-winning photograph from her back garden

పెరట్లో వాలిన నక్షత్ర మండలం

సుదూర తీరాల్లోని నక్షత్ర మండలాలను ఫొటోలు తీయాలంటే దానికి పెద్ద పెద్ద టెలీస్కోపులు కావాలి..అబ్జర్వేటరీలుండాలి. కానీ, ఇంటి పెరట్లోకి వెళ్లి 5 వేల కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్ర మండలాలను చూపించమంటే.. ‘ఎస్ ’ అంటూ తలూపుతారా? కష్టం కదా! కానీ, 60 ఏళ్ల బామ్మ మాత్రం చేసి చూపించింది.

బ్రిటన్ లోని గ్వెర్న్ సె లోగల చానెల్ ఐలాండ్స్​కు చెందిన జీన్ డీన్ అనే మహిళ ఈ ఘనత సాధించింది. 5 వేల కాంతిసంవత్సరాల దూరంలోని మోనోసెరస్ రీజియన్ లో ఉన్న పాలపుంత రొసెట్టె నెబ్యులాను తన టెలీస్కోపుతో క్లిక్ మనిపించింది. ఆ ఫొటో నాసా ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ద డేగా నిలిచింది. ఫొటోను పోటీకి పంపినా ఏం గెలుస్తాంలే అని ఊరికే ఉండిపోయిందట. నాసా నుంచి ఫోనొచ్చే సరికి షాక్ అయిందట. ఏప్రిల్ 12న ఆమె ఫొటో ఈ అవార్డు ను గెలుచుకుంది.

ఇదొక్కటే కాదు.. ఆమె ఇలాంటివి చాలా ఫొటోలే తీసింది.ఆండ్రోమెడగా  గాలక్సీ, కాలిఫోర్నియా నెబ్యులా, ద పాక్ మాన్ నెబ్యులా, ద ఐరిస్ నెబ్యులా వంటి వాటిని తన టెలీస్కోపు ద్వారా ఫొటోలు తీసిం ది. అన్నీ తన పెరటి నుం చే కావడం విశేషం.

Latest Updates