ఆస్తి కోసం నాయనమ్మను చంపిన మనవడు

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. శంకర్ పల్లి మండలం ఎలవర్తి గ్రామంలో ఆస్తి కోసం సొంతం నాయనమ్మ65 ఏళ్ల కంసమ్మ పై  పెట్రోల్ పోసి నిప్పంటించాడు మనమడు. గత నెల రోజుల క్రితం తన ముగ్గురు కూతుర్ల పేరున ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసిందన్న కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె అక్కడే మృతి చెందగా… ఇల్లు మొత్తం కాలి బూడిదైంది. అతనితో పాటు తల్లి ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు 10వ తరగతి చదువుతున్నాడు.

Latest Updates