MP బండిసంజయ్ కు సారీ చెప్పిన గ్రానైట్ వ్యాపారులు

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మద్ధతుగా గ్రానైట్ యునియన్ కు చెందిన నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న కొందరు గ్రానైట్ వ్యాపారులు కలెక్టరేట్ ముట్టడించారని… వాళ్లు చేసింది తప్పని వాళ్లకు గ్రానైట్ యూనియన్ కు సంబంధంలేదని అన్నారు. తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారం అవసరమని… తాము ఏపార్టీకి చెందిన వాళ్లము కామని అన్నారు. కొందరు గ్రానైట్ వ్యాపారులు సోమవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను విమర్షించారని అందుకు తాము సంజయ్ సార్ కు మీడియా ముందు క్షమాపన చెప్తున్నామని అన్నారు. యూనియన్ లోని ప్రతీ లేబర్ ను సంస్థలో భాగస్వామ్యం (ఇన్సురెన్స్) చేస్తున్నామని చెప్పారు.

Latest Updates