
రాజేంద్రనగర్, వెలుగు: రాజేంద్రనగర్ లోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ గ్రేప్ గార్డెన్ లో జరుగుతున్న గ్రేప్ ఫెస్టివల్ తో సందడి నెలకొంది. సహజ ఎరువులతో ఇక్కడ పండిస్తున్న 59 రకాల ద్రాక్ష పండ్లలో నచ్చిన రకం కొనుక్కొని తినే అవకాశం ఇవ్వడంతో కొనుగోలుదారులు తరలి వస్తున్నారు. మూడు రోజుల నుంచి జనం బారులు తీరుతున్నారు. నేరుగా చెట్టు నుంచి కోసుకునే ఆప్షన్ ఇవ్వడంతో తోటలో తిరుగుతూ, ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. శివరాత్రి పండుగ నేపథ్యంలో అధిక సంఖ్యలో వస్తున్నారు. రాజేంద్రనగర్ కు వెళ్లే మెయిన్ రోడ్డులోని వెటర్నరీ కాలేజీకి ముందుగా వెళ్తే ఈ గ్రేప్ తోటకు చేరుకోవచ్చు.