తెలుగు దేశం కదులుతోంది

  • టీడీపీని వీడనున్న గ్రేటర్ నాయకులు

లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ నిర్ణయాన్ని నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ సిటీలోని పలు నియోజకవర్గ నేతలు పార్టీకి నేడో రేపో రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో చేరేం దుకు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. పార్టీకి రాజీనామా చేసేనేతలలో ఖైరతాబాద్, సనత్ నగర్, ముషీరాబాద్, సికిం ద్రాబాద్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి పొత్తుతో చాలా మందికి పోటీ చేయటానికి అవకాశం లభిం చలేదు. ఇపుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ముందుకు వచ్చినప్పటి కీ అధిష్ఠానం నుంచి స్పందన లేకపోవటంతో తీవ్ర నిరాశలో నేతలు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుంటే టికెట్ ఇవ్వలేదని, పొత్తు వల్ల అవకాశం రాలేదని చెబుతున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గ కీలక నేత ‘వెలుగు’ ప్రతినిధితో తెలిపారు. ఇక సికిం ద్రాబాద్ నుం చి పోటీ చేస్తానని, అవకాశం ఇవ్వాలని నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు కోరినా స్పందన లేకపోవటంతో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నగరంలోని కీలక నియోజకవర్గం నుం చి పోటీ చేసిన ఓనేత కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో కొన్ని ప్రాంతాలలో ప్రభావం చూపే నాయకుడు కావటంతో పార్టీలోకి రమ్మని టీఆర్‍ఎస్‍, బీజే పీ, కాం గ్రెస్ నేతలు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యకర్తల నుం చి వ్యతిరేకత వస్తుం డటంతో రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన అనూషారామ్, మాజీ ఎంపీ నామా టీఆర్‍ఎస్ లో చేరారు. ఎన్నికల్లోపు అధికార పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని తెలుస్తోంది.

Latest Updates