కేసీఆర్ ఓ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి

కేసీఆర్ ఓ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ముందస్తు పథకం ప్రకారమే గ్రేటర్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించారని తెలిపారు. వరద సాయం పేరుతో ఎన్నికల్లో లబ్ది పొందాలని కేసీఆర్ అనుకున్నారని తెలిపారు. GHMC ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లతో సమావేశమైనే ఆయన.. బీజేపీ నుంచి ఎన్నికైన కార్పొరేటర్లను సన్మానించారు. ఇందులో బాగంగా మాట్లాడిన బండి సంజయ్… ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. TRS చెప్పు చేతల్లో ఎన్నికల కమిషన్ నడిచిందన్నారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు కూడా సమయం ఇవ్వలేదని చెప్పారు. ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కారని ఆరోపించారు. అయినా గ్రేటర్ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారన్నారు. బీజేపీ కార్యకర్తలంతా కలసి కట్టుగా శ్రమించారన్న బండి సంజయ్… దుబ్బాక ఫలితం తర్వాత కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.

కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డి, కన్వినర్ లక్ష్మణ్, జాయింట్ కన్వినర్లు వివేక్ వెంకటస్వామితో పాటు బీజేపీ ముఖ్యనేతలు హాజరయ్యారు.

Latest Updates