టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 గా నమోదు

పశ్చిమ టర్కీ, గ్రీస్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కుదిపేయడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపం దాటికి పలు భవనాలు కూలడంతో పాటు.. సెంట్రల్‌ ఇజ్మీర్‌లోని 20 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భూకంపం ప్రభావంతో ఏజియన్‌ సముద్రంలో చిన్నపాటి సునామీ సంభవించడంతో… ఇజ్మీర్‌ పరిధిలోని సమోసా తీర ప్రాంతాల్లోని ఇళ్లలోకి సముద్రపు నీరు చేరుకుంది. అయితే ఈ భూకంపం దాటికి ఎంతమంది మరణించారనేదానిపై స్పష్టత రాలేదు. అయితే ప్రాణనష్టం అధికంగానే ఉండే అవకాశం ఉందంటున్నారు స్థానిక అధికారులు.

Latest Updates