నగరంలో గ్రీన్ బిల్డింగ్స్

నగర జీవనమంటేనే కాంక్రీట్ జంగిల్ గా మారింది. చిన్న వర్షం కురిస్తే తిప్పలే. స్వచ్చమైన గాలి పీల్చుకుందామంటే దొరకదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు సిటీలో గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. అసలు గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏంటి. వాటితో పర్యావరణాన్ని ఎలా కాపాడొచ్చు. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

పర్యావరణానికి హాని జరగకుండా.. గ్రీన్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు బిల్డర్స్. వర్షపు నీరు ఇంకేలా, స్వచ్ఛమైన గాలి ఉండేలా, తక్కువ విద్యుత్ వాడుకునేలా, వాడిన నీటిని శుద్ది చేసి తిరిగి యూజ్ చేసేలా వసతులు ఉంటాయి. దాంతో ఈ గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ నగరవాసులను బాగా ఆకర్షిస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న ఈ బిల్డింగ్స్ నమూనాల్లో.  ఇళ్ళు, అపార్ట్ మెంట్స్ నిర్మించడానికి బిల్డర్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లో 180 ప్రాజెక్టులు రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, అపార్ట్ మెంట్స్, ఐటీ పార్క్స్ తో పాటు కమర్షియల్ కాంప్లెక్సులు ఉన్నాయి.

ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అపార్ట్ మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్సులకు గ్రీన్ రేటింగ్ ఇస్తుంది. వీటితో పాటు భవన నిర్మాణంలో వాడే మెటీరియల్ కి గ్రీన్ ప్రో సర్టిఫికెట్ ఇస్తుంది. ఇండియాలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ గత పదేళ్ల నుంచే ఉన్నా… ప్రస్తుతం వీటికి ఆదరణ పెరుగుతోంది. ఇళ్లు కొనుకునే వారితో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా గ్రీన్ బిల్డింగ్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వంద గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులుండగా తెలంగాణలో 300కిపైగా ఉన్నాయి.

గ్రీన్ బిల్డింగ్స్ లో సోలార్ పవర్ ని వాడతారు.  దీంతో పాటు అక్కడ వాడేవన్నీ సీఎఫ్ఎల్ బల్బులే. దీంతో 40శాతం విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు. అలాగే ఫ్లాట్స్ లోకి సూర్యకాంతి నేరుగా వచ్చేలా బ్లాకు, బ్లాకులకు మధ్య గ్యాప్ ఇచ్చి కడతారు.

గ్రీన్ బిల్డింగ్ అపార్ట్ మెంట్స్ లో 70శాతం నీటి వృథాని తగ్గిస్తారు. ఇంట్లో రోజూవాడే నీటిని బయటకు పోకుండా చేసి.. వాటిని రిఫ్రెష్ చేసి గార్డెనింగ్ కి, బాత్ రూమ్ అవసరాలకు ఉపయోగిస్తారు. అలాగే వర్షపు నీటిని ఇంకుడు గుంతలకు పోయేలా చేస్తారు. స్ట్రీట్ లైట్స్ కి కూడా ఎల్ఈడీ బల్బులే వాడతారు. ప్రస్తుతం మన దేశంలో నాలుగు బిలియన్ స్క్వేర్ ఫీట్ల గ్రీన్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. 2022నాటికి టెన్ బిలియన్ స్క్వేర్ ఫీట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.

Latest Updates