గ్రీన్ పటాకులు

గ్రీన్ క్రాకర్స్ చూడటానికి మామూలు పటాకుల్లానే ఉంటాయి. కానీ, వాటి నుంచి
వచ్చే పొగ, శబ్దా లు తక్కువగా ఉంటాయి.ఇపుడు మనం వాడే పటాకులు ఎక్కువ
స్థా యిలో నైట్రోజన్‌‌‌‌, సల్ఫర్‌‌‌‌ వాయువులు విడుదల చేస్తాయి. అదే గ్రీన్‌‌‌‌ క్రాకర్స్‌‌‌‌లో
అయితే ఆ వాయువులు నలభై నుంచి యాభై శాతం వరకు తక్కువ ఉంటాయట. వీటిలో ఆంటిమోని, లిథియమ్‌ , మెర్క్యురీ, ఆర్సెనిక్‌ , లెడ్‌ వంటి ప్రమాదకర రసాయనాలు ఉపయోగించరు. ఈ పటాకుల తయారీ కోసం ప్రత్యేకమైన పదార్థా లు వినియోగిస్తారు. అంతేకాదు ఇవి రంగు రంగుల మెరుపులను వెదజల్లుతాయి. వీటిలో కూడా సేఫ్ వాటర్ రిలీజర్స్‌‌‌‌(నీరు విడుదల చేసేవి), సేఫ్ మినిమల్   అల్యూమినియం(అల్యూమినియం తక్కువ ఉపయోగించే వి), సేఫ్ థెర్మైట్ క్రాకర్స్‌‌‌‌, అరోమా పటాకులు.. లాం టి రకాలున్నాయి. నిజానికి ఇలాం టి క్వాలిటీలున్న క్రాకర్స్ తయారీ అసాధ్యం . కానీ, ఇలాం టి పటాకులు తయారు చేసేం దుకు కౌన్సి ల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ దృష్టిపెట్టిం ది. అంతే కాకుం డా మామూలు బాణసంచాతో పోలిస్తే గ్రీన్‌‌‌‌ క్రాకర్స్‌‌‌‌ ధరలు తక్కువగా ఉంటాయంట. ప్రస్తుతం కొన్ని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌‌‌‌ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరో నాలుగేళ్లు ఆగాల్సిందే.. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లో హరిత పటాకులు పూర్తిస్థా యిలో అందుబాటులో లేవు. పెట్రోలియం అండ్‌ ఎక్స్‌‌‌‌ప్లొ జివ్స్‌‌‌‌ సేఫ్టీ
ఆర్గనైజేషన్‌‌‌‌ నుంచి ముందుగా అనుమతి రావాల్సి ఉంది. ఆ తర్వాత సీఎస్‌ ఐఆర్‌‌‌‌కు చెందిన నేషనల్‌‌‌‌ ఎన్విరాన్మెం టల్‌‌‌‌ ఇంజినీరిం గ్‌ రీసెర్చ్ సంస్థ గ్రీన్ క్రాకర్స్‌‌‌‌ తయారు చేస్తుం ది. కాబట్టి ఇవి ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరో నాలుగైదేళ్లు పట్టొచ్చని
శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈలోపు కన్వె న్షనల్ క్రాకర్స్‌‌‌‌కు బదులు గ్రీన్ క్రాకర్స్‌‌పై ప్రజలకు అవగాహన, ఆసక్తి కలిగించేలా
ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి ఉంది. మరో వైపు ప్రపంచంలో ఎక్కడా హరిత పటాకుల వినియోగం లేదని, మన దేశంలోనే ఈ ఆలోచన
పుట్టిం దని సైంటిస్టులు చెబుతున్నారు.అస్సాంలో 130 ఏళ్ల నుంచే.. అస్సాంలోని గనక్కుకి అనే గ్రామంలో 1885 నుంచి గ్రీన్ క్రాకర్స్‌‌ తయారు చేస్తు న్నారు. ఈ బాణసంచాను కాలిస్తే తక్కువ శబ్దంతో పాటు పొగ, కెమికల్స్ చాలా తక్కువ స్థా యిలో
విడుదలవుతాయని అక్కడి తయారీదారులు చెప్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి పెద్దగా హాని జరగదంట. అయితే, ప్రస్తు తం ఈ గ్రీన్ క్రాకర్స్‌‌ను మిషన్స్‌‌తో కాకుండా మనుషులే తయారు చేస్తు న్నారు.‘మేము తయారు చేసే బాణసంచా గ్రీన్ క్రాకర్స్‌‌ లాంటివే. వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు చాలా తక్కువగా ఉంటాయి. మా ప్రొడక్ట్స్‌ శాస్తవేత్తలు పరీక్షిస్తే ఎంత వరకూ రసాయనాలు వాడామనే విషయం తెలుస్తుం ది.అపుడు మాకు కూడా ఉపాధి పెరుగుతుంది. తరతరాలుగా మా కుటుంబం ఇలాంటి క్రాకర్స్‌‌ తయారు చేస్తు న్నా’మని చెప్పాడు గోప్‌ జిత్‌ పథక్‌‌.

Latest Updates