ముంబై మెట్రో రైలు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దయిన మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 15నుంచి ముంబై లో మెట్రో రైళ్లను దశల వారీగా పట్టాలెక్కించేందుకు అనుమతిచ్చింది. దీనికి సంబంధించి  ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్‌ లాక్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే…స్కూళ్లు, కాలేజీలు, ప్రార్థనా మందిరాలను తెరిచే అంశంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెట్రో రైళ్ల సర్వీసులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేస్తుందని ప్రభుత్వం చెప్పింది. మెట్రో రైళ్లకు అనుమతించిన ప్రభుత్వానికి ముంబై మెట్రో కృతజ్ఞతలు తెలిపింది. ఈ నెల 19న (సోమవారం) ఉదయం 8.30గంటల నుంచి ప్రయాణికులకు సేవలందించనున్నట్టు ట్విట్లర్ లో చెప్పింది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో రైళ్ల సేవలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Latest Updates