గ్రీన్​ఫీల్డ్​ హైవేకు గ్రీన్​ సిగ్నల్​

ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్​లేన్

ఎన్​హెచ్63కి అనుబంధంగా శాంక్షన్ చేసిన కేంద్రం

మూడేళ్ల కిందటి అలైన్​మెంట్​కే ఎన్ హెచ్​ఏఐ ఆమోదం

125 కిలోమీటర్లకు రూ.2,591 కోట్లు కేటాయింపు

మంచిర్యాల, వెలుగు: మూడేళ్ల క్రితం ప్రపోజ్​చేసిన గ్రీన్​ఫీల్డ్​హైవేకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. నేషనల్​ హైవే 63లో భాగంగా నిజామాబాద్​జిల్లా ఆర్మూర్​నుంచి మంచిర్యాల జిల్లా గద్దెరాగడి వరకు దీనిని నిర్మించనున్నారు. 125 కిలోమీటర్ల పొడవైన ఫోర్​లేన్​ కోసం రూ.2,591 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. నేషనల్​ హైవేస్​అథారిటీ ఆఫ్​ఇండియా(ఎన్ హెచ్ఏఐ) ఈ నిర్మాణం చేపట్టనుంది.

బోధన్​ టు జగ్దల్​పూర్.. ​

ఎన్​హెచ్​63 బోధన్​ నుంచి నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మీదుగా మహారాష్ర్టలోని సిరొంచ నుంచి చత్తీస్​గఢ్​లోని జగ్దల్​పూర్​ వరకు విస్తరించి ఉంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం ఇందారం క్రాస్​రోడ్డు నుంచి మహారాష్ట్ర సరిహద్దుల్లోని కోటపల్లి మండలం అర్జునగుట్ట వరకు ఫోర్​లేన్​నిర్మాణం జరుగుతోంది. 2017లో ఆర్మూర్​నుంచి మంచిర్యాల వరకు గ్రీన్​ఫీల్డ్​హైవేను శాంక్షన్ చేసిన కేంద్రం బోధన్​ నుంచి నిజామాబాద్​ వరకు ఫోర్​లేన్​ను మంజూరు చేసింది.

ఎన్​హెచ్​లతో లింక్​

కేంద్ర ప్రభుత్వం గ్రీన్​ఫీల్డ్​హైవేను ఇతర నేషనల్​హైవేలతో లింక్​చేస్తూ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అలైన్​మెంట్​ఇప్పటికే తయారైంది. హైదరాబాద్​ టు నాగ్​పూర్​ ఎన్ హెచ్​44కు ఆర్మూర్​దగ్గర లింక్​చేసి మంచిర్యాల జిల్లా గద్దెరాగడి వద్ద ఎన్​హెచ్​363కి కలిసి, మళ్లీ ఇందారం ఎక్స్​రోడ్డు దగ్గర ఎన్​హెచ్​63తో పాటు రాజీవ్​ రహదారితో కలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ–మహారాష్ర్ట బోర్డర్​లోని అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదిపై, మహారాష్ర్ట–చత్తీస్​గఢ్ బోర్డర్​లోని ఇంద్రావతి నదిపై బ్రిడ్జిలు పూర్తయ్యాయి. రాయపట్నం దగ్గర గోదావరి నదిపై మరో కొత్త బ్రిడ్జి రానుంది.

రియల్ ​వెంచర్లకు దెబ్బ

ఆర్మూర్​నుంచి మంచిర్యాల సమీపంలోని ముల్కల్ల వరకు వ్యవసాయ పొలాల మీదుగా సాగే గ్రీన్​ఫీల్డ్​హైవే ఆ తరువాత మంచిర్యాల, క్యాతన్​పల్లి మున్సిపాలిటీల్లో ఎంటరై ముందుకెళ్తుంది. ముల్కల్ల, వేంపల్లి శివార్ల నుంచి రంగంపేట, రాళ్లవాగు పైనుంచి ఆర్​ఆర్​నగర్, అమ్మ గార్డెన్స్, ఎంఎన్​ఆర్​గార్డెన్స్​ఏరియాలోని రియల్​ వెంచర్ల మీదుగా వెళ్లి గద్దెరాగడి వద్ద ఎన్​హెచ్​363కి కలుస్తుంది. దీనికి సంబంధించి రూపొందించిన అలైన్​మెంట్​కు ఎన్​హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. దీంతో మంచిర్యాల, క్యాతన్​పల్లి మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, రియల్​ వెంచర్లకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం గ్రీన్​ఫీల్డ్​ రోడ్డు ప్రతిపాదన వల్ల ఈ ప్రాంతంలో రియల్​ బిజినెస్​ స్తంభించిపోయింది. తిరిగి బిజినెస్​ పుంజుకుంటూ భూముల రేట్లు పెరుగుతున్న సమయంలో గ్రీన్​ఫీల్డ్​కు గ్రీన్​సిగ్నల్​ రావడం రియల్టర్లకు మింగుడుపడని అంశంగా మారింది.

పొలాల మీదుగా ఫోర్​లేన్​

గ్రీన్​ఫీల్డ్​హైవేను పూర్తిగా పొలాల మీదుగా నిర్మించేలా అలైన్​మెంట్​ను రూపొందించారు. ఆర్మూర్​ నుంచి మంచిర్యాల మధ్య మెట్​పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట టౌన్లు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న రోడ్డు మీదుగా ఫోర్​లేన్​నిర్మిస్తే పై పట్టణాలతో పాటు అనేక గ్రామాల్లో జనావాసాలకు నష్టం జరుగుతుంది. భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో జనావాసాలకు నష్టం లేకుండా, బడ్జెట్​ను తగ్గించేలా గ్రీన్​ఫీల్డ్​ హైవేను కేంద్రం ప్రతిపాదించింది. పూర్తిగా వ్యవసాయ భూముల్లోంచి ఈ రోడ్డు నిర్మాణం జరగనుండడంతో గ్రీన్​ఫీల్డ్​గా పేర్కొంటున్నారు.

మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ యారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ

నడిసొచ్చిన దారిలో నలుగురికి సాయం చేస్తున్నారు

పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం

Latest Updates