పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం

లాక్ డౌన్ ఉన్న‌ప్ప‌టికీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌తి ఒక్క‌రూ అభినందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వారిపై పూలు జ‌ల్లుతూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు. శ‌నివారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చేర్ల బాదేపల్లి నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుల‌పై పూల వ‌ర్షం కురిపించారు.

కరోనా వ్యాధిని తరిమి కొట్టేందుకు తమ బాధ్యతలలో భాగంగా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వారిని ఘణంగా అభినందిస్తూ పూల వర్షం కురిపించారు. అనంతరం కార్మికులకు అల్పాహారం ప్యాకేట్లను అందజేశారు.

Latest Updates