కశ్మీర్: బస్డాండులో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి

  • 20 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం

కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ బస్టాండ్ లోకి ప్రవేశించి.. జనాల మధ్య గ్రనేడ్ విసిరి, పారిపోయారు ముష్కరులు. ఈ దాడిలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం కశ్మీర్లోని సొపోర్ టౌన్ లో జరిగింది.

సొపోర్ టౌన్ లోని హోటల్ ప్లాజా సమీపంలో ఉన్న బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల మధ్యన టెర్రరిస్టులు గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో 20 మందికి పైగా గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో ఆరుగురికి సీరియస్ గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్ తరలించారు.

దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. అటాక్ చేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆర్మీ, కశ్మీర్ పోలీసుల జాయింట్ టీమ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

Latest Updates