లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: ఉప్పు, పప్పులు ఎక్కువగా కొన్నరు

  • ఎఫ్‌ఎంసీజీల కొనుగోలు ఎక్కువే
  • పెరిగిన సరుకుల బిల్లులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌లో జనాలు ఉప్పు, పప్పులు ఎక్కువగా కొన్నారు. మామూలుగా చేసే బిల్లు కంటే లాక్‌డౌన్‌ రోజుల్లో బిల్లులు ఎక్కువయ్యాయని కిరాణ షాపుల ఓనర్లు చెప్తున్నారు. వాటిలో కూడా ఎఫ్‌ఎమ్‌సీజీ ప్రాడెక్ట్‌లను ఎక్కువగా కొన్నారని అన్నారు. మార్చిలో బిల్లు సైజ్‌ ఒక్కసారిగా రెండింటలైందని చెప్పారు. వీటిలో నిత్యావసర వస్తువులు, శానిటైజర్స్, ఫ్లోర్ క్లీనర్స్‌ కు గిరాకీ బాగా పెరిగింది. కరోనా కాలంలో పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు అందరూ ఇంపార్టెంన్స్‌ ఇచ్చారని అన్నారు. కస్టమర్‌‌ బిల్‌ సైజ్‌ మామూలు కంటే సగటున 1.5 రెట్లు పెరిగిందని, మార్చిలో యావరేజ్‌ బిల్లు రూ.650 కాగా.. ఏప్రిల్‌కి ఆ బిల్లు రూ.వెయ్యికి పెరిగింది. ప్రస్తుతం అది రూ.900కి చేరింది. మళ్లీ మళ్లీ బయటకు రాకుండా ఒకేసారి కొనుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ప్యాకెట్లనే ఎక్కువగా కొనుకున్నారని స్టోర్స్‌ నిర్వాహకులు చెప్పారు. “ బిల్లు ప్రతిసారి కంటే ఈ సారి 1.5 పెరిగింది. పెద్ద ప్యాకెట్లను ఎక్కువగా కొనుకున్నారు. స్టోర్లలో స్టాక్‌ ఉండదనే ఉద్దేశంతో ఒకేసారి కొనేసుకున్నారు” అని స్పెన్సర్స్‌ సీఈవో దేవేంద్ర చావ్లా చెప్పారు. బిస్కెట్లు, నూడిల్స్‌, చాక్లెట్లు లాంటివి ఎక్కువగా.. పెద్ద ప్యాకెట్లు కొన్నారని, లిమిటెడ్‌ టైమింగ్స్‌ వల్ల ఒకేసారి అన్ని కొనేసుకున్నారని ఐటీసీ ఫుడ్స్‌ డివిజనల్‌ సీఈవో హేమంత్‌ మాలిక్‌ చెప్పారు. బయట ఫుడ్‌ దొరకక పోవడంతో ఇంట్లోనే వెరైటీస్‌ చేసుకుంటున్నారని, అందుకే 5కేజీల నూనె డబ్బాలు, కేజీ నెయ్యి ప్యాకెట్లు ఎక్కువగా అమ్ముడు పోయాయని వ్యాపారులు చెప్పారు. వాటితో పాటు కూల్‌డ్రింక్స్‌, చిప్ప్ ప్యాకెట్లు కూడా పెద్ద మొత్తంలో కొనుకున్నారని చెప్పారు. ఆఫీసులు, మాల్స్, స్కూల్స్, కాలేజీలు, మల్టిఫ్లెక్స్‌లు, పబ్స్, రెస్టారెంట్లు, అన్ని ప్రభుత్వ ఆఫీసులు మూతపడటం, ప్రైవేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తుండటంతో… ఇన్‌–హోమ్‌ కంన్జప్షన్ పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. కరోనాను అరికట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ విధించి ఆంక్షలు విధించింది. షాపులు, సూపర్‌‌మార్కట్లకు కొన్ని గంటలు మాత్రమే పర్మిషన్‌ ఇచ్చింది. రెండోసారి ఎక్స్‌టెండ్‌ చేయడంతో మళ్లీ ఇదే పరిస్థితి వస్తుందనే భయంతో ప్రజలు ఎక్కువ మొత్తంలో సరుకులు కొనుకుని స్టాక్‌ చేసుకున్నారు.

Latest Updates