కిరాణా షాపు యజమాని దేశభక్తి: సాయుధ దళానికి రూ.50 లక్షల విరాళం

హైదరాబాద్ : ఓ కిరాణా షాపు యజమాని దేశభక్తిని చాటుకున్నాడు. జీవిత కాలం పొదుపు చేసిన మొత్తం రూ.50 లక్షలను భారత సాయుధ దళాల నిధికి విరాళంగా ఇచ్చాడు. హుజూర్ నగర్ కు చెందిన శ్రీపురం విశ్వనాథం (78) చిన్నప్పట్నుంచీ దేశం కోసం ప్రత్యేకంగా డబ్బులను పొదుపు చేశాడు. తాను బతికి ఉన్నప్పడే ఆ డబ్బును సాయుధ దళాల సంక్షేమం కోసం అందజేయాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అందజేశారు. సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ పేరుతో రూ.50 లక్షల చెక్కును గవర్నర్ కు అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు విశ్వనాథం.

Latest Updates