పెళ్లికూతురుకు సప్రైజ్ :పెళ్లి మండపానికి ప్యారాచూట్ పై వచ్చిన ప్రియుడు

సాధారణంగా వధువును వివాహ చేసుకునేందుకు పెళ్లి ఫంక్షన్ కు కారు లేదా జీపు.. ఇంకా ఆసక్తి ఉంటే గుర్రాల బగ్గీపై వస్తాడు. కానీ  కానీ ఇక్కడ ఓ వరుడు మాత్రం విమానం నుంచి దూకి ప్యారాచూట్ సాయంతో పెళ్లిమండపానికి చేరుకున్నాడు.

ఇండో అమెరికన్ అక్షయ్ యాదవ్ ఓ యువతిని ప్రేమించాడు. ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో వారిద్దరి పెళ్లికూడా ఫిక్స్ అయ్యింది. ఆయువతిని పెళ్లి చేసుకునే సమయం ఆసన్నమైంది. అసలే ప్రేమించిన ప్రియురాలు పైగా పెళ్లి . ఇంకేం ఆ మధురక్షణాలు కలకలం గుర్తుండిపోయేలా ప్రియురాలికి గిఫ్ట్ ఇద్దమనుకున్నాడు అక్షయ్. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా.

లాస్ కాబోస్ ద్వీపంలో వధువు గగన్ ప్రీత్ సింగ్ తో పాటు 500 మంది భారతీయులు వరుడు అక్షయ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.

పెళ్లి మూహుర్తానికి ముందే ప్రియురాల్ని సప్రైజ్ చేసేందుకు వెడ్డింగ్ ప్లానర్ జోహైబ్ అలీతో వెరైటీ అడ్వంచర్ ను ప్లాన్ చేసుకున్నాడు.  ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నాడు. పెళ్లిమూహుర్తం సమయానికి విమానం నుంచి దూకి ప్యారా చూట్ సాయంతో ద్వీపానికి చేరుకున్నాడు.

దీంతో పెళ్లికొడుకు రాకపై ఇరుకుంటుంబాల సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సన్నివేశాల్ని వెడ్డింగ్ ప్లానర్ క్యాప్చర్ చేసి పెళ్లికుమారుడు అక్షయ్ తన ప్రియురాలు గగన్ ప్రీత్ కు గిప్ట్ గా ఇచ్చాడు.

Latest Updates