కాసేపట్లో పెళ్లిమండపానికి చేరిక.. అంతలోనే వరుడి కారులో మంటలు..

వరుడి కారులో మంటలు..

కాపాడిన లాక్డౌన్ డ్యూటీ చేస్తున్న పోలీసులు

మండపానికి పోలీస్ వాహనంలో తీసుకొచ్చిన పోలీసులు

పెళ్లి మండపానికి బయలుదేరిన పెళ్లి కొడుకు కారులో అకస్మాత్తుగా మంటలు వచ్చిన ఘటన ఢిల్లీలో జరిగింది. కారులో మంటలను గమనించిన పోలీసులు కారును ఆపడంతో పెళ్లి కొడుకుతో పాటు మరోకరు సురక్షితంగా బయటపడ్డారు.

ఢిల్లీకి చెందిన భూపేంద్ర వివాహం సోమవారం (నిన్న) జరపడానికి పెద్దలు నిశ్చయించారు. అంతా అనుకున్నట్లుగా పెళ్లి కూతురు, కొంతమంది బంధువులు పెళ్లిమండపానికి చేరుకున్నారు. భూపేంద్ర కూడా ఓఖ్లాలోని పెళ్లిమండపానికి ఐ20 కారులో బయలుదేరాడు. అతను బయలుదేరిన కాసేపటికి కారులో మంటలు అంటుకున్నాయి. అది భూపేంద్ర గమనించలేదు. అక్కడే రోడ్డు పక్కన లాక్డౌన్ డ్యూటీ చేస్తున్న ఇద్దరు పోలీసులు అది గమనించారు. వెంటనే కారును ఆపి.. భూపేంద్రను మరియు అతనితో ఉన్న మరో వ్యక్తిని కిందికి దిగమని సూచించారు. అలా వాళ్లు కారు దిగారో లేదో ఒక్కసారిగా కారులో మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో భూపేంద్ర భయబ్రాంతులకు గురయ్యాడు. పెళ్లిమండపంలో అందరూ ఎదురుచూస్తుంటారని భావించిన పోలీసులు వెంటనే భూపేంద్రను తమ పోలీసు వాహనంలో పెళ్లిమండపానికి తీసుకెళ్లారు. దాంతో పెళ్లి అనుకున్న సమయానికే జరిగింది.

కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నందున వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొన్ని పెళ్లిళ్లు మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..కొంతమంది అతిథుల మధ్య జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

For More News..

పడవల ద్వారా తమిళనాడు నుంచి ఏపీకి 90 మంది

దేశచరిత్రలోనే కొత్త పథకం.. నేడు ఏపీలో ప్రారంభం

లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం

Latest Updates