మహిళా మంత్రి నడుంపై చేయి వేసిన BJP మంత్రి

త్రిపుర : ప్రధాని మోడీ సమక్షంలోనే ఓ మహిళా మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ మంత్రి ఆమె నడుంపై తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అది కూడా ప్రధాని మోడీ ఉన్నచోటే కావడంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల త్రిపురలో చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అగర్తలాలో నిర్వహించిన ఓ ర్యాలీకి ప్రధాని నరేం‍ద్ర మోడీతో పాటు.. త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌ హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఆహార మంత్రిత్వ శాఖ మినిస్టర్‌ మనోజ్‌ కంతి దేబ్‌ తో పాటు.. త్రిపుర మహిళా మంత్రి వెళ్లారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుండగా మనోజ్‌.. మహిళా మంత్రిని వెనక వైపు నుంచి అసభ్యకర రీతిలో తాకాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహిళా మంత్రి పట్ల మనోజ్‌ చేసిన పాడు పనికి సీరియస్ అవుతున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రధాని, సీఎం సమక్షంలోనే మనోజ్‌ మహిళా మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమె గౌరవానికి భంగం కలిగించారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.  తక్షణమే అతన్ని పదవి నుంచి తొలగించి.. అరెస్ట్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. స్త్రీలను సంప్రధించడం మన బాధ్యత అని చెప్పే రాజకీయ నేతలే ఇలాంటి నీచమైన పనులు చేయడం సిగ్గుచేటు అంటున్నారు పలువురు మహిళలు. సాధారణ మహిళలు రోజూ బస్సుల్లో, గుడిలో, ఇలాంటి నీచులవల్ల ఎక్కడో చోట రోజూ బలవుతున్నారని, ఇలాంటి కామాంధులకు తగిన శిక్షలు వేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

Latest Updates