హైదరాబాద్ లో పెరగని గ్రౌండ్ వాటర్ లెవల్స్

హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. చెరువులు, వాగులే కాదూ ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారాయి. హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా కురిసిన వర్షాలకు రోడ్లు, నాలాలు పొంగిపొర్లినా…గ్రౌండ్ వాటర్ లెవల్స్ మాత్రం ఆశించినస్ధాయిలో పెరగలేదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. రాష్ట్రంలో ఈసారి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కానీ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. సిటీలో వర్షాలు పడుతున్నా గ్రౌండ్ వాటర్ లెవల్స్ మాత్రం అంతటా పెరగలేదంటున్నారు ఎక్స్ పర్ట్స్. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ గా మారడంతో పాటు ఖాళీ స్థలాలను కభ్జాచేయడమే ఇందుకు కారణమంటున్నారు. లేక్ ప్రొటెక్షన్ కాగితాలకే పరిమితం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 198 వరకూ చెరువులు ఉన్నా వాటిని, ఆన్ లైన్ లో పెట్టేలా 19 శాఖలతో కమిటీ ఏర్పాటు చేసినా ఎక్కడా పర్యవేక్షణ లేదు.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ మధ్య కోఆర్డినేషన్ లోపం కూడా కారణమంటున్నారు. దీంతో హైదరాబాద్ లో వర్షంపడ్డా అత్యధికంగా మురుగు నీరే చెరువుల్లో చేరుతోందని..స్వచ్ఛమైన నీరు రావట్లేదంటున్నారు. వర్షం నీరు స్టోరేజీగా ఉండే లేక్స్… సిటీలో మాయం అవడం… ఉన్నవాటిని కాపాడలేక పోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలున్నాయి. కనీసం ఉన్నవాటికి  ఫెన్సింగ్ చేయించి, గ్రావిటీ, FTL ప్రకారం లేని వాటిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంలో విఫలమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. వర్షం నీరు చెరువుల్లోకి చేరక నాలాల ద్వారా బయటకు వెళ్లడంతో గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరగడం లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రభుత్వం గ్రౌండ్ వాటర్ పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జనం కూడా సామాజిక భాధ్యతతో వ్యవహరించాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. లేకుంటే భవిష్యత్ లో నీటికష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Latest Updates