కరోనా మూలాలపై చైనాలో డబ్ల్యూహెచ్‌వో విచారణ.. ముగిసిన గ్రౌండ్‌ వర్క్

జెనీవా: కరోనా వైరస్ పుట్టుకకు చైనా కారణమని అమెరికా ప్రెసిడెంట్ పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా ప్రపంచ దేశాలు కూడా మహమ్మారికి డ్రాగనే పుట్టినిల్లు అని గొంతెత్తాయి. దీంతో కరోనా పుట్టుక విషయంపై చైనాను విచారించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించిన విషయం విధితమే. డబ్ల్యూహెచ్‌వోకు చెందిన ఇన్వెస్టిగేటివ్ టీమ్ చైనాకు వెళ్లి విచారించింది. ఈ విషయాలను తాజాగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్​ టెడ్రోస్ అథనామ్ గెబ్రియెసస్ వెల్లడించారు. వైరస్ మూలాలను కనుగొనే యత్నంలో చైనాలో గ్రౌండ్‌వర్క్‌ను పూర్తి చేశామన్నారు.

‘చైనాకు వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో అడ్వాన్స్ టీమ్ మిషన్‌ను ముగించింది. వైరస్ మూలాలు కనుగొనడానికి అవసరమైన ఉమ్మడి యత్నాలను మరింత ముమ్మరం చేయనుంది. త్వరిత కేసుల్లో ఇన్ఫెక్షన్ సోకడానికి కారణమైన మూలాన్ని కనుగొనే పనులను వూహాన్‌లోని ఎమిడెమియలాజికల్ స్టడీస్ ప్రారంభిస్తుంది’ అని వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టెడ్రోస్ చెప్పారు.

Latest Updates