జులై మొదటి వారం లో గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

గ్రూప్ 2 రాసిన అభ్యర్ధులకు గుడ్ న్యూస్.  వచ్చే నెల మొదటి వారం లో గ్రూప్ 2 ఇంటర్వ్యూలుంటాయని టీఎస్పీఎస్సి చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన చక్రపాణి.. TSPSC 2017-2018 వార్షిక నివేదికను ఆయనకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండురోజుల్లో గ్రూప్ 2 కి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. దాదాపు 2 వేల మందిని ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి ఇంటర్వ్యూ షెడ్యూల్ 2 నెలలు వరకు ఉండే అవకాశం ఉందన్నారు. టీఆర్టీకి సెలక్టయిన వారి వివరాలను ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే నియామకాలు ఉంటాయని అన్నారు. కోర్ట్ కేసుల వలన ఆగిపోయిన పోస్ట్ లను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని సీఎం కేసీఆర్ అన్నట్లు చక్రపాణి తెలిపారు.

Latest Updates