ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్

ఢిల్లీలో పొల్యూషన్ ఏమాత్రం తగ్గడం లేదు. పంట వ్యర్థాలను తగలబెట్టడం తగ్గినా కాలుష్యం ఎఫెక్ట్ చూపిస్తోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు సివియర్ కేటగిరీలోనే ఉన్నాయి. లోధీ రోడ్ ఏరియా సహా కొన్ని ఇతర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లుగా చూపుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో 489 పాయింట్లు ఉంది. అంటే ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఇవాళే ఢిల్లీలో సరిబేసి రూల్ ముగియనుంది. ఈ రూల్ పెట్టినా పొల్యూషన్ తగ్గలేదు. రేపట్నుంచి మళ్లీ సరిబేసి లేకపోతే అన్ని వాహనాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మరింత వాయు కాలుష్యం అవుతుందన్న వాదన ఉంది.

అయితే సరిబేసి విధానాన్ని పొడగించాలా వద్దా అన్న విషయంపై కేజ్రీవాల్ సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అత్యవసరం అనుకుంటే సరిబేసి రూల్ ను పొడగిస్తామని గతంలోనే సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రూల్ బ్రేక్ చేసిన 4309 మందికి చలాన్లు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఒక్కొక్కరికి 4 వేల రూపాయల ఫైన్ విధించారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. ఎయిమ్స్ రోడ్ ల  ఉదయం పూట విజిబులిటీ కూడా చాలా తక్కువగా ఉండడం వాహనదారులు లైట్ల వెలుగులోనే ప్రయాణించాల్సి వచ్చింది.

Latest Updates