హాస్పిటల్స్ కి పోతలేరు.. ఆన్ లైన్లోనే ట్రీట్ మెంట్

హైదరాబాద్, వెలుగు : రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లే పేషంట్స్ సంఖ్య కరోనా భయంతో తగ్గిపోయింది. ప్రాబ్లమ్ ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారానే డాక్ల‌ర్ ను అప్రోచ్ అవుతున్నారు. వారు కూడా పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉండి, ఎమర్జెన్సీ అయితే తప్ప హాస్పిటల్ కి రావొద్దని చెప్తున్నారు. ఒక్కో డాక్ట‌ర్ డైలీ 100కి పైగా కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. వర్చువల్ కన్సల్టేషన్ పెరిగిపోవడంతో ఓపీ సగానికిపైగా తగ్గిపోయాయంది. కరోనాకి ముందు ఒక్కో హాస్పిటల్ లో డైలీ వెయ్యి ఉంటే, ఇప్పుడు 250లోపే ఉంటోంది. ఈ ఆన్ లైన్ క‌న్స‌ల్టేషన్ కోసం ప్రతి హాస్పిటల్ లో 8 –-10 మందితో స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేస్తున్నారు. టీం మెంబర్స్ పేషెంట్ ప్రాబ్లమ్ ను బట్టి సంబంధిత డాక్ల‌ర్ కి సమాచారం అందిస్తున్నారు.
ఎమర్జెన్సీ ఉంటేనే..
సిటీలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ కరోనా పేషెంట్స్ కి ట్రీట్ మెంట్ అందిస్తుండడంతో డాక్ట‌ర్లే రెగ్యులర్ పేషెంట్స్ ను హెల్త్ చెకప్ కోసం రావొద్దని చెప్తున్నారు. ఆయాసం, చెస్ట్ పెయిన్, స్ట్రోక్ వంటి సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రమే రావాలని సూచిస్తున్నారు. జనరల్ చెకప్ ఉంటే వీడియో కాల్స్ ద్వారా సజెషన్స్ ఇస్తున్నారు. చెవి, ముక్కు, కంటి సమస్యలు ఉన్నవారికి కూడా వీడియో కాల్స్ లో ట్రీట్మెంట్ చేయడం కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. కొంత మంది పేషెంట్స్ ని నేరుగా చూస్తేనే కండిషన్ అర్ద‌మవుతుందని, అలాంటి వారిని ఆస్పత్రికి రమ్మంటున్నామని తెలిపారు.

పేషెంట్స్, డాక్టర్ కి మధ్య..

లాక్డౌన్ కి ముందు నుంచే సిటీలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో వీడియో కన్సల్టేషన్ ఉంది. వైరస్ కారణంగా పేషెంట్స్ కి అందుబాటులో ఉండేందుకు దాదాపు ఇప్పుడన్ని హాస్పిటల్స్ ఆన్ లైన్ కన్సల్టేషన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి కాల్స్ బాగా పెరిగాయి. డ్యూటీ డాక్ట‌ర్స్ కు రెగ్యులర్ పేషెంట్స్ తో పాటు కరోనా సోకగా వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దాంతో పేషెంట్స్, డాక్ట‌ర్ల‌కి మధ్య వారధిగా ఉండేందుకు హాస్పిటల్ యాజమాన్యాలు వీడియో కన్సల్టేషన్ కోసం సపరేట్ టీమ్లను ఏర్పాటు చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates