కాల్స్ తో.. ఖాళీ చేస్తున్న‌రు

కామారెడ్డి, వెలుగు: ఫోన్కాల్ చేసి పరిచయం ఉన్నోళ్ల లెక్కనే మాట్లాడుతరు..లాటరీ తగిలిందనో.. ఇంకేదో వచ్చిందనో చెప్పి నమ్మిస్తరు.. ఆధార్, బ్యాంకు అకౌంట్ డీటేల్స్ అడుగుతరు. చెప్పినంక కొద్దిసేపటికి అకౌంట్లోని పైసలన్నీ ఖతం చేస్తరు. ఇలాంటి ఆన్లైన్ మోసాలు కామారెడ్డి జిల్లాలో ఇటీవల పెరుగుతున్నాయి. మూడు నెలల్లో ఆరుకు పైగా ఘటనలు జరిగాయి. మరికొన్ని బయటకు రానివి కూడా ఉన్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నా నేరస్తులు మాత్రం దొరకడంలేదు.

మోసాలు ఇలా..

ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ ఏటీఎం కార్డు, పిన్ నంబర్లు అడుగుతున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే తప్పులు సరిదిద్దాలని చెబుతున్నారు. కొందరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఏదో విధంగా డీటేల్స్ సేకరిస్తున్నారు. పెద్ద మొత్తంలో లాటరీ తగిలిందని ముందస్తుగా జీఎస్టీ, ఐటీ కట్టాలంటూ అకౌంట్లో పైసలు వేయించుకోవటం, తక్కువగా రేటుకు వస్తువులు అమ్ముతున్నామంటూ.. ఇలా పలు రకాలుగా ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ చేసిన వ్యక్తులను నమ్మి బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్, ఏటీఎం పిన్నంబర్లు చెప్పగానే ఖాతాల్లో నుంచి నగదు మాయం చేస్తున్నారు. తాము మోసపోయామని కొందరు బయటికి వచ్చి చెబుతుండగా, చెప్పుకుంటే పరువు పోతుందని మరికొందరు ఎవరికీ చెప్పుకోవడలేదు. పోలీస్ శాఖ అప్రమత్తం చేస్తున్నా జనాలు మోసపోతూనే ఉన్నారు. అగంతకులు ఆన్ లైన్ లో ఫోన్ చేస్తుండగా ఆధారాలు తెలియక పోలీసుల దర్యాప్తు ముందుకెళ్ల‌డం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం