GST ఎఫెక్ట్ : పెరిగిన వంటగ్యాస్ ధర

LPG-Gasవంటగ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. సబ్సిడి, సబ్సిడీయేతర సిలిండర్లపై ధరలను పెంచినట్లు శనివారం (జూన్-30) వెల్లడించింది కేంద్రం. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌ పై రూ.2.71 పెంచినట్లు తెలిపింది ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(IOC). ఒక్కో సబ్సిడీయేతర సిలిండర్‌ పై రూ.55.50 పెంచింది. ఈ పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ LPG సిలిండర్‌ ధర రూ.493.55కు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. సవరించిన LPG ఎ(సబ్సిడీలేని) ధరలపై GST విధించడంతోనే గ్యాస్‌ ధరలు పెరిగాయని తెలిపింది IOC. అంతర్జాతీయంగా సహజవాయువు ధరల పెంపు, డాలర్‌ తో రూపాయి విలువ బలహీనపడటం ఇందుకు మరో కారణం.

Posted in Uncategorized

Latest Updates