GST ఎఫెక్ట్:  రెస్టారెంట్లలో తక్కువ ధరకే భోజనం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్(GST) దేశ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా రెస్టారెంట్లలో పలు రకాల పేర్లతో పన్నులు విధించే ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది GST. ఇది రెస్టార్లకు వచ్చే కస్టమర్లకు  ఎంతో లాభం చేకూర్చనుంది. ప్రత్యేకించి మధ్య తరగతి ప్రజలు GST విధానంతో రెస్టారెంట్లలో ఎంతో లబ్ధి పొందుతున్నారు. రెస్టారెంట్లలో ఇప్పుడు భోజనం చాలా తక్కువకే లభిస్తుంది ఇందుకు కారణం GST. ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లపై GST విధించడంతో ధరలు 14.22శాతం నుంచి 5 శాతానికి తగ్గాయి. గౌహతిలో 23వ GST సమాఖ్య సమావేశంలో 14.22శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

GST నుంచి వచ్చే లాభాలు రెస్టారెంట్లు తీసుకోవు. ఒకవేళ లిక్కర్  కొనుగోలు చేస్తే దానిపై వచ్చే రాష్ట్ర పన్ను GST పరిధిలోకి రాదు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లాభాలు కస్టమర్లకు ఇవ్వని కారణంగా రెస్టారెంట్ యజమానులు కూడా ఇందుకు అర్హులు కారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  జైట్లీ తెలిపారు. స్టార్ హోటల్స్‌లో మాత్రం 18శాతం స్థిరంగా GST ఉంటుంది. ఔట్ డోర్ క్యాటరింగ్‌కు కూడా 18శాతం GST ఉంటుందని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates