మరోసారి లక్ష కోట్లు దాటాయ్..నవంబర్ లో దుమ్మురేపిన జీఎస్టీ వసూళ్లు

మరోసారి జీఎస్టీ లక్ష కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్ధికశాఖ తెలిపింది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..నవంబర్ లో రూ.1.04 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అక్టోబర్ లో రూ.1.05 లక్షల కోట్లు వసూలు కాగా నవంబర్ లో రూ. 1.04 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూ. 19,189 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) రూ. 25,540 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ. 51,992 కోట్లు, సెస్ కింద రూ.8,242 కోట్లు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేయగా..2019-20 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 12 నెలలకు గాను 8 నెలల్లో లక్ష కోట్ల మార్కును చేరింది.

Latest Updates