రింగు డాన్స్‌‌తో గిన్నిస్ రికార్డ్

రింగ్ డాన్స్.. రింగులు నడుము చుట్టూ వేసుకుని తిప్పుతూ డాన్స్ చేసే దీన్నే ‘హూలా హూప్స్ డాన్స్’ అంటారు. సర్కస్‌‌లో అయితే మూడు, నాలుగు రింగులతో ఒకేసారి యమ స్పీడ్‌‌గా నడుమును తిప్పుతూ డాన్స్ చేస్తారు. అది  చూసేవాళ్లెవరైనా ‘వావ్’ అనకుండా ఉండలేరు. అయితే, లండన్‌‌కు చెందిన మరియం ఒలైవోలా అనే  ఓ అమ్మాయి ఒకేసారి ఏకంగా 30 రింగుల్ని తిప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. నెటిజన్లంతా ఆమె డాన్స్‌‌కు ఫిదా అవుతున్నారు. 21 వేలమందికి పైనే ఈ వీడియోకు లైక్ కొట్టారు. ఇంతమందిని మెప్పించిన ఆ వీడియోలో ఏముందోనని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్లు ఓ లుక్ వేశారు. ఇంకేముంది.. 30 రింగులతో 35 సెకన్ల పాటు ఆపకుండా చేసిన రింగుల డాన్స్‌‌కు వాళ్లు కూడా ఫిదా అయ్యారు. మరియంకు గిన్నిస్‌‌ వరల్డ్ రికార్డ్‌‌లో స్థానం కల్పించారు.

ఇవి కూడా చదవండి 

కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది

ఏపీలో రూ.23,500.. తెలంగాణలో రూ.15 వేలే

 

 

Latest Updates