పులుల లెక్కలకు గిన్నిస్ గుర్తింపు

న్యూఢిల్లీ: మనదేశం చేపట్టిన 2018 టైగర్ సెన్సస్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చోటు దక్కింది. ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా రికార్డుల్లోకెక్కింది. ఈ సర్వే ఫలితాలను నిరుడు గ్లోబల్ టైగర్ డే సందర్భంగా ప్రధాని ప్రకటించారు. దీని ప్రకారం మనదేశంలో పులుల సంఖ్య 2,967గా ఉండగా.. ఇది ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల జనాభాలో 75%గా ఉంది. ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఆఫీసర్లు దాదాపు 141 డిఫరెంట్ సైట్లలో 26,838 వేర్వేరు లొకేషన్లలో కెమెరాలను అమర్చి.. అడవి జంతువులకు సంబంధించిన 34,858,623 ఫొటోలను తీశారు. దీని ద్వారా దేశంలో మొత్తం పులుల సంఖ్య దాదాపు మూడు వేలుగా అధికారులు అంచనాకు వచ్చారు.

For More News..

ఓటర్లను తక్కువ చేసి చూడొద్దు

Latest Updates