13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. త్రండిని చంపేస్తామని బెదిరింపు

ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన అప్పును అడ్డం పెట్టుకుని.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడా దుర్మార్గుడు. అప్పు తీర్చడానికి దారి చూపిస్తానని నమ్మించి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే తండ్రిని చంపేస్తామంటూ బెదిరించి స్నేహితులతోనూ రేప్ చేయించాడు. అక్కడితో ఆ కిరాతకుడి పైశాచికత్వం ఆగలేదు. ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దించి.. డబ్బు చేసుకున్నాడా రాక్షసుడు. మూడు నెలల పాటు ఆ చిన్నారిని హింసించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగింది.

ఓ నిరుపేద కూలీ దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య వైద్యం కోసం భరత్ కర్సానా భఖర్ అనే వ్యక్తి దగ్గర రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ అప్పు తీరే మార్గం చెబుతానంటూ ఆ కూలీ 13 ఏళ్ల కుమార్తెను పని పిల్లగా తీసుకెళ్లాడు భఖర్. మూడు నెలల పాటు పని చేసి తిరిగి వస్తుందని చెప్పాడు. మరో దారిలేక చదువు మానేసి ఇంట్లోనే ఉంటున్న బిడ్డను పనికి పంపారు ఆ తల్లిదండ్రులు. కానీ భఖర్ ఇంటికి తీసుకెళ్లాక.. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే తండ్రిని చంపేస్తానని బెదిరించి.. మూడు నెలల పాటు బందీగా పెట్టుకుని అతడి స్నేహితులనూ పిలిచి పలుమార్లు గ్యాంగ్ రేప్‌కు చేశారు.

ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆ బాలిక భయపడుతూనే తన బాధను తల్లిదండ్రులతో చెప్పుకుంది. దీంతో వాళ్లు అమ్రోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. భఖర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి రేప్ చేయడమే కాకుండా ఆ చిన్నారిని వ్యభిచారంలోకి కూడా దించి డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై ఈ దారుణానికి పాల్పడిన ఏడుగురిని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. నిందితులు భఖర్, యోగేశ్ మన్షుఖ్ సెంజాలియా, సునీల్ వాఘేలా, కౌశిక్ మన్షుఖ్ సెంజాలియా, భరత్ జస్మత్, జగ్దీశ్ మోహన్, సందీప్ శివరామ్ గుప్తాలను అరెస్టు చేసినట్లు చెప్పారు పోలీసులు.

More News:

బాధల నుంచి విముక్తి ఇచ్చా: తల్లిని చంపిన కొడుకు

మిస్డ్ కాల్ ఇస్తే చాలు! లక్షల్లో గిఫ్ట్.. : ట్విట్టర్లో ఫోన్ నంబర్ వైరల్

డ్రీమ్ జాబ్!: వారంలో 4 రోజులే ఆఫీస్.. 6 గంటలే వర్కింగ్ టైమ్

Latest Updates