కరోనా నుంచి కోలుకొని.. గుడిలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే

గాంధీనగర్‌‌: కాంట్రవర్షియల్‌‌ స్టేట్‌‌మెంట్స్‌‌తో వార్తల్లో ఉండే బీజేపీ గుజరాత్‌‌ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్‌‌ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈమధ్యే కరోనా నుంచి కోలుకున్న ఆయన వడోదరలోని గజ్రవ్డీ ప్రాంతంలో ఉన్న ఓ గుడిలో భజనలు పాడుతూ డ్యాన్స్‌‌ చేశారు. కరోనా రూల్స్‌‌ పక్కనబెట్టి, ముఖానికి మాస్క్‌‌ లేకుండా హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అవుతోంది. ఆ వీడియోపై మధు స్పందించారు. ‘గుడిలో డ్యాన్స్‌‌ చేసింది నేనే. ప్రతి శనివారం అక్కడ అలాగే చేస్తాను. ఈ శనివారమూ అక్కడికి వెళ్లాను. 45 ఏండ్లుగా వెళ్తూనే ఉన్నాను. ఇదేం కొత్త కాదు. సర్కారు కొవిడ్‌‌ రూల్స్‌‌ను నేనేం ఉల్లంఘించలేదు. అంతా పక్కాగా ఫాలో అయ్యాను. గుడిలో చాలా తక్కువ మంది ఉన్నారు. అది ప్రైవేట్‌‌ గ్యాదరింగ్‌‌’ అని చెప్పారు. ఆ గుడి తనదేనని, గుడిలో మాస్కు పెట్టుకోవాలన్న రూలేం లేదని అన్నారు. శ్రీవాస్తవ ఘటనపై స్పందించేందుకు బీజేపీ సీనియర్ నేతలు నిరాకరించారు. ఆగస్టు చివరి వారంలో మధుకు కరోనా వచ్చిందని తేలింది. ఓ వారం పాటు హాస్పిటల్‌‌లోనే ఆయన ట్రీట్‌‌మెంట్‌‌ పొందారు. ఈమధ్యే క్వారంటైన్‌‌ పూర్తి చేసుకున్నారు.

Latest Updates