ప్రయాణికురాలిని రేప్ చేసిన బస్ డ్రైవర్, కండక్టర్

బస్సులో పడుకునేందుకు కొంచెం ప్లేస్ ఇప్పించాలంటూ అడిగిన పాపానికి ఓ ప్రయాణికురాల్ని బస్సు డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేశారు. గుజరాత్ లోని పోర్ బందర్ కు చెందిన భార్యభర్తలు పని నిమిత్తం మధ్య ప్రదేశ్ కుక్సీ పట్టణానికి వెళ్లారు. భర్త కుక్సీలో ఉండగా భార్య పదిరోజుల తరువాత సొంతూరు పోర్ బందర్ కు ప్రయాణమైంది. పోర్ బందర్ కు వచ్చేందుకు కుక్సీలో ఓ ప్రైవేట్ బస్ ఎక్కింది. అయితే ప్రయాణికుల కోసం బస్సు డ్రైవర్  చోటా ఉదయ్ పూర్ ఓ హోటల్ వద్ద నిలిపివేశాడు. ప్రయాణికులందరూ తినేందుకు వెళ్లగా..అందులో బాధితురాలు తనకు పడుకునేందుకు బస్సులో చోటివ్వాలని బస్సు డ్రైవర్ నానాబాయ్ , కండక్టర్ కపిల్ ను కోరింది. అందుకు బాధితురాలి ప్లేస్ చూపిస్తామని మాయమాటలు చెప్పి బస్సు వెనక్కి తీసుకెళ్లారు. బాధితురాల్ని బలవంతంగా బస్ రూఫ్ టాఫ్ పై ఎక్కించి అత్యాచారానికి ఒడిగట్టారు. దారుణం అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్ యధావిధిగా బస్సును పోర్ బందర్ తీసుకొచ్చారు. తనపై జరిగిన దారుణం నుంచి తనని తాను కాపాడుకునేందుకు బస్ రూఫ్ టాప్ పై పోర్ బందర్ కు వచ్చిన బాధితురాలు తన అల్లుడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

 

Latest Updates