ట్రాఫిక్‌ చలాన్లను తగ్గించిన గుజరాత్‌

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం భారీగా చలాన్లను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. అయితే ఇందకు భిన్నంగా గుజరాత్ ప్రభుత్వం మాత్రం  ట్రాఫిక్ చలాన్లను తగ్గించింది. ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ తమ రాష్ట్రంలో జరిమానాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా వెయ్యి రూపాయిలు విధిస్తుండగా.. దాన్ని రూ. 500కు తగ్గించారు. సీటు బెల్టు పెట్టుకోని వారికి వెయ్యి రూపాయిలు చలాన్ విధించాల్సి ఉండగా గుజరాత్‌ ప్రభుత్వం 500 రూపాయలు చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే ద్విచక్ర వాహనాలకు 2 వేల రూపాయిల జరిమానా, ఇతర వాహనాలకు 3 వేల రూపాయిల జరిమానా విధించనున్నారు. కొత్త మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం దేశంలోని ఇతర ప్రాంతాల్లో వీటికి రూ.5 వేల జరిమానా విధిస్తున్నారు.

Latest Updates