వరదలో పిల్లలను మోసుకుంటూ పోయిన కానిస్టేబుల్

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన గుజరాత్ కానిస్టేబుల్  కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. వరద ప్రాంతాల్లో NDRF సిబ్బంది, పోలీసులు, జవాన్లు సహాయ చర్యలు చేస్తుండగా..  వారికి ఓ చోట ఇద్దరు చిన్నారులు కనిపించారు. ఎటు చూసినా కనుచూపుమేర వరదనీళ్లే కనపడుతున్నాయి. గట్టుకు చేరే పరిస్థితిలేదు. తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పోలీస్ కానిస్టేబుల్ పృథ్విరాజ్ సింగ్ జడేజా తన భుజాలపైకి ఎత్తుకుని.. వరదనీటిలో నడుచుకుంటూ గట్టుకు చేర్చారు. ఇద్దరు చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్  సాహసం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానిస్టేబుల్  ను ప్రశంసించారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని. ట్విట్టర్ లో ఆ వీడియోను అప్ లోడ్ చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ సింగ్ జడేజా ఉదాహరణగా నిలుస్తున్నారని గుజరాత్ సీఎం కొనియాడారు.

Latest Updates