రైల్వే ట్రాక్ పై టెంట్లు.. గుజ్జర్ల ఆందోళన

జైపూర్: రాజస్థాన్ లో గుజ్జర్లు మళ్లీ రోడ్డెక్కారు. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్నారు. సవాయి మాదాపూర్ లోని మాక్ సుందన్ పురాలో రైలు పట్టాలపై బైఠాయించారు గుజ్జర్లు. రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోటా సాధించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని గుజ్జర్లు తేల్చిచెబుతున్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి స్పందించి తమకు వెంటనే న్యాయం చేయాలని కోరుతున్నారు.

గుజ్జర్ల ఆందోళనతో రాజస్థాన్ సర్కార్ అప్రమత్తమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించింది. రైల్వే శాఖ కూడా ముందస్తు చర్యలు తీసుకుంది. కోట డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిసర్వీసులను దారి మళ్లించింది.

Latest Updates