గులాబ్‌జామ్‌​ కూర

గులాబ్​జామ్‌​ తెలుసా…? తెలుసానా.. నోట్లో వేసుకుంటే కరిగిపోదూ తియ్యగా అంటారు కదా! కానీ, ఈ గులాబ్​జామ్‌​ మాత్రం వెరీ వెరీ స్పెషల్​. ఎందుకో తెలుసా? ఇది స్వీట్​ స్వీట్​ గులాబ్‌జామ్‌​ కాదు కాబట్టి.. హాట్​ హాట్​ గులాబ్‌జామ్‌​ కూర. ఊరుకోండి.. గులాబ్​జామ్‌​తో ఎవరైనా కూర చేస్తారా అని అనకండి. ఎందుకంటే ఇది నిజంగా గులాబ్​జామ్‌​ కూర నిజం కాబట్టి. ఇప్పుడు ట్విట్టర్​లో దీనిపైనే చర్చ మొదలుపెట్టారు మన నెటిజన్లు.

హర్ష్​ మిట్టల్​ అనే ఓ వ్యక్తి ఆ కూరకు సంబంధించిన ఫొటో షేర్​ చేసి ‘‘రోజురోజూ నాలో మానవత్వంపై నమ్మకం పోతోంది” అంటూ ట్వీట్​ చేశాడు. దీంతో కొందరు కామెంట్ల మీద కామెంట్లు చేశారు. ఉంది అని కొందరంటే లేనే లేదంటూ మరికొందరు వాదనలకు దిగారు. రాజస్థాన్​లో దీన్ని బాగా వండుతారని, మస్తు టేస్ట్​ ఉంటుందని ఓ యూజర్​ కామెంట్ చేసింది. ఇంకో యూజర్​ అయితే, గులాబ్​జామ్‌​ ఏంటి, రస్​మలాయ్​తోనూ కూర చేసేస్తారు తెలుసా అంటూ కామెంట్​ చేశాడు. జోధ్​పూర్​లో ఆ రెండూ చాలా ఫేమస్​ అన్నాడు. నెయ్యితో, కారం కారంగా భలే మజా వస్తుందని చెప్పాడు. కొందరు యూజర్లు గుండె నొప్పితో చావాల్సిందేనంటూ కామెంట్లు పెట్టారు.

Latest Updates