తుపాకీ తీసిండు.. కాల్చిండు

  • గోడకు తాకిన బుల్లెట్‌
  • పేట్‌ బషీరాబాద్‌ పరిధిలోని దేవరయంజాల్‌ లో ఘటన
  • భూవివాదమే కారణం
  • తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు

జీడిమెట్ల, వెలుగు: పేట్​బషీరాబాద్ పోలీస్​స్టేషన్ పరిధిలోని దేవరయంజాల్‌‌‌‌లో ఆదివారం కాల్పులు కలకలం రేపాయి. భూ వివాదం నేపథ్యం లో వివాదం చెలరేగి కాల్పుల వరకూ వెళ్లిం ది. పోలీసులు
తెలిపిన వివరాల ప్రకారం.. దేవరయం జాల్‌‌‌‌కు చెందిన అన్నదమ్ములు మహిపాల్‌‌‌‌రెడ్డి, వేణుగోపాల్‌‌‌‌రెడ్డికి కొంతకాలంగా భూమి విషయంలో పంచాయితీ జరుగుతుం ది. ఈ నేపథ్యం లో ఆదివారం కూడా వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వేణుగోపాల్‌‌‌‌రెడ్డి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ గురితప్పి గోడను తాకిం ది. తన కొడుకు మహిపాల్‌‌‌‌రెడ్డిని చంపాలనే ఉద్దేశంతో వేణుగోపాల్‌‌‌‌రెడ్డి కాల్పులు జరిపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తండ్రి పి.నర్సిం హారెడ్డి పేట్​ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates