పంజాగుట్ట ఆర్టీసీ బస్సులో కాల్పులు

హైదరాబాద్ సిటీ బస్సులో రివాల్వర్ తో ఫైరింగ్ చేసి ప్యాసింజర్లను టెన్షన్ పెట్టాడు ఓ వ్యక్తి. సికింద్రాబాద్ నుంచి మణికొండ వైపు వెళుతోన్న 47L సర్వీస్ బస్సు(నంబర్ ఏపీ 28 జెడ్ 4468)లో కాల్పులు అలజడి రేపాయి. బస్సు దిగే విషయంలో… ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. సఫారీ సూట్ వేసుకున్న  ఓ ప్రయాణికుడు తన దగ్గరున్న గన్ తీసి.. పైకి కాల్పులు జరిపాడు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బస్సు పై కప్పు నుంచి బుల్లెట్ బయటికి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు.

పంజాగుట్ట శ్మశానవాటిక దగ్గర ఈ ఘటన జరిగింది.  కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Latest Updates