పుట్టినరోజు నాడు స్కూళ్లో గన్ ఫైరింగ్.. ఇద్దరు విద్యార్థులు మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియా, శాంటా క్లారిటీలోని సౌగుస్ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయం స్కూల్ ప్రారంభమయ్యే సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సౌగుస్ హైస్కూల్‌లో చదివే 16 ఏళ్ల విద్యార్థి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉదయాన్నే స్కూల్‌కు వచ్చిన ఆ విద్యార్థి తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తానే కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా, మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన హెన్రీ మాయో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడో ఇంకా తేలియలేదు. కాగా, సౌగుస్ హైస్కూల్ ఘటన దృష్ట్యా ఈ రోజు అక్కడి పాఠశాలలన్నింటికి అధికారులు సెలవు ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిది గురువారం పుట్టినరోజని కొంతమంది విద్యార్థులు చెబుతున్నారు.

Latest Updates