గన్ మిస్ ఫైర్..కానిస్టేబుల్ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

కుమ్రం భీం జిల్లా తిర్యాని మండల పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయ్యింది. గన్ క్లీన్ చేస్తుండగా గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కిరణ్ కుమార్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన  కిరణ్ కుమార్ ను వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. కిరణ్  స్వస్థలం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చౌటపల్లి. 132వ బెటాలియన్ బి-కంపెనీలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

SEE MORE NEWS

చండీగఢ్‌లో ముగ్గురు విద్యార్థినుల సజీవ దహనం

ఈ అంకిత అందరికీ ఆదర్శం

Latest Updates