అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఒకరి మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్ లో గురువారం రాత్రి ఓ ఆగంతకుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో  ఒకరు మృతి చెందగా  పలువురికి గాయాలయ్యాయి. వైట్ హౌస్ కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాల్పుల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఇందులో ఒకరు చనిపోయారని పోలీసులు చెబుతున్నారు.

వైట్ హౌస్ కు 3 కిలోమీటర్ల దూరంలోని కొలంబియా రోడ్ లోని 14 స్ట్రీట్ లో ఈ కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికా టైం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ ఫైరింగ్ జరిగింది. విషయం తెలియగానే అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను హాస్పిటల్ కు తరలించారు.

Latest Updates