కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు

అఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్ లో దారుణం జరిగింది. ఆయుధాలు ధరించిన ముష్కరులు ఆదివారం తెల్లవారుజామున సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. దేశ రాజధానిలో ఈ దారుణం జ‌ర‌గ‌డంతో క‌ల‌క‌లం రేగింది. న్యాయమూర్తులు కోర్టు వాహనంలో కార్యాలయానికి వెళ్తుండగా ఈ దాడి జరిగిందని సుప్రీంకోర్టు ప్రతినిధి అహ్మద్ ఫాహిమ్ ఖవీమ్ తెలిపారు. ఈ ఘటనలో వారిద్దరు మరణించగా వాహనం డ్రైవర్‌ గాయపడినట్లు తెలిపారు. ఆ దేశ సర్వోన్నత కోర్టులో 200 మంది మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కాబూల్‌ పోలీసులు కూడా ఈ దాడిని ధ్రువీకరించారు. తాలిబన్ల పనిగా అనుమానం వ్యక్తం చేయగా ఆ సంస్థ ఖండించింది.

Latest Updates