అటు గన్లు… ఇటు కత్తులు.. సాహో వేడుకలో హైలైట్

guns-weapons-attracts-in-saaho-pre-release-event

డార్లింగ్ ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిలింసిటీలో సందడిగా జరుగుతోంది. వందల సంఖ్యలో అభిమానులు ఫిలింసిటీకి వచ్చారు. ఫిలింసిటీ ప్రాంతంలో భారీ వేదికను ఏర్పాటుచేశారు. భారీ స్క్రీన్లలో ఈవెంట్ ను లైవ్ టెలికాస్ట్ చేశారు.

జెట్ సూట్ లో ప్రభాస్… ఓ వైపు గన్స్.. మరోవైపు కత్తులు ఉన్న భారీ సెటప్ ను.. భారీ వాహనంపై ఏర్పాటుచేశారు. ఈ వాహనం ముందుకు… అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి పోటీపడ్డారు. సినిమాలో హీరో, పోలీసులు వాడిన గన్స్ ఓవైపు.. విలన్స్ వాడిన మారణాయుధాలు మరోవైపు ప్రదర్శించినట్టు చెబుతున్నారు.

భారీ బెలూన్లు, ప్రభాస్ కటౌట్లు, పోస్టర్లు… ఆకట్టుకున్నాయి.

Latest Updates