గురుకుల పీఈటీ అభ్యర్థుల నిరసన : సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: గురుకుల  పీఈటీ అభ్యర్థులు  హైదరాబాద్ లో  సీఎం క్యాంప్  ఆఫీసు  ముట్టడికి  ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా  614  ఉద్యోగాలకు…. 2017లో  నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. రాత పరీక్షలు అయిపోయి, ఫలితాలు వెలవడ్డాయని తెలిపారు. ఇంటర్వ్యూల జాబితా కూడా రెడీ అయిందన్నారు గురుకుల  పీఈటీ అభ్యర్థులు. అయితే ప్రభుత్వం ఇంటర్వూలు నిర్వహించకుండా,  ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తమ బతుకులతో  చెలగాటం ఆడుతోందని  ఆవేదన వ్యక్తం చేశారు.

ఫలితాలు విడుదల చేయక పోతే కారుణ్య మరణాలే శరణ్యం అంటు క్యాంప్ ఆఫీస్ వద్ద ఫ్ల కార్డ్స్ తో నిరసన తెలిపారు. దీంతో క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడటంతో గురుకుల పీఈటీ అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు గోశామహల్ స్టేడియానికి  తరలించారు.  వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ నుండి ముట్టడికి వచ్చిన అభ్యర్థులను అరెస్ట్ చేయడం తగదని ఆందోళన వ్యక్తం చేశారు.

Latest Updates