జాబ్ కోసం వెళితే.. 20 కోట్ల జాక్ పాట్

దుబయ్: సరదాగా చేసిన పని సంపదను తెచ్చిపెట్టింది. జాబ్ కోసం యూఏఈకి వెళ్లిన ఇండియన్.. లాటరీలో కోట్లు దక్కించుకున్నాడు. 20 కోట్ల వరకు జాక్ పాట్ కొట్టాడు. పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్.. షార్జాలో ఐటీ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఖాళీ టైంలో సరదాగా లాటరీ టికెట్లు కొని తన అదృష్టాన్ని పరీక్షించుకునేవాడు. అలాగే మొన్నటి ఆగస్టు 12న లాటరీ టికెట్ కొన్నాడు. రెండేళ్లుగా లాటరీ కొంటున్న గురుప్రీత్.. ఆ టికెట్​ తన ఫ్యూచర్​ను మార్చేస్తుందని అనుకోలేదు. కానీ ఈ నెల 3న లాటరీ ఆర్గనైజర్లు సింగ్ కు ఫోన్ కాల్ చేశారు. విన్నర్లలో అతడి పేరు కూడా ఉన్నట్లు చెప్పారు. అయితే అది ప్రాంక్ కాల్ అని గురుప్రీత్ భావించాడు. తర్వాత చెక్ చేసి.. లాటరీలో ఏకంగా 10 మిలియన్ దిర్హామ్స్ (19.90 కోట్లు) గెలుచుకున్నట్లు తెలుసుకున్నాడు.

Latest Updates