భారత జట్టులో ధోని స్థానం కష్టమే: హర్ష భోగ్లే

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి అన్ని దారులు మూసుకుపోయినట్టేనన్నారు క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే. ఇండియాకు మరోసారి ఆడాలనే ధోనీ కోరిక నెరవేరకపోవచ్చన్నారు. ధోనీ చిన్ననాటి కోచ్ రంజన్ బెనర్జీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత జట్టులో తిరిగి స్థానాన్ని దక్కించుకోవడం ధోనీకి కష్టమని ఆయన చెప్పారు. ఐపీఎల్ కూడా వాయిదా పడటంతో… తిరిగి సత్తా చాటి జట్టులోకి రావాలనుకున్న ధోనీ ఆశలు నెరవేరడం కష్టమేనని అన్నారు. అయితే ధోనీకి BCCI చివరి అవకాశం ఇస్తుందని… T20 వరల్డ్ కప్ లో ధోనీకి చివరి అవకాశం ఉండొచ్చని చెప్పారు.

Latest Updates