అభ్యర్ధిని నిలబెట్టే ధైర్యం కూడా కాంగ్రెస్ కు లేదు: గుత్తా

నల్లగొండ: జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్.. తమ పార్టీ నుంచి అభ్యర్థిని కూడా నిలబెట్టె ధైర్యం లేదని టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిషత్ ఎన్నికల్లో మూడు జడ్పిలు, మెజార్టీ ఎంపీపీలు తమవే అని, అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలిపించుకుంటామని అన్నారు. తమ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిచేలా అందరం కలిసి కృషి చేస్తామని ఆయన అన్నారు.

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికపై కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు హాస్యాస్పదమని, ఎన్నికల్లో వాళ్ళ అహంకారానికి ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇస్తారని గుత్తా తెలిపారు. భువనగిరిలో లక్ష ఓట్లతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని అన్నారు. జిల్లాలో ఉత్తమ్, జనారెడ్డిలు అనామకులుగా మారిపోయారని గుత్తా అన్నారు.

Latest Updates