14 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

హైదరాబాద్ బండ్లగూడలో 14 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను జనగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో గుట్కా విక్రయిస్తున్న యాదగిరిని పట్టుకుని విచారించిన పోలీసులు హైదరాబాద్ బండ్లగూడ నుంచి సరాఫరా అవుతున్నట్లు గుర్తించారు. సీఐ మల్లేష్ నేతృత్వంలో హైదరాబాద్ బండ్లగూడలో సోదాలు నిర్వహించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates